గంజాయి బ్యాచ్ లను ప్రోత్సహిస్తున్నదెవరో ప్రజలకు తెలుసు: అనుశ్రీ

రాజమహేంద్రవరం, సామాజిక మాధ్యమాల్లో వైసిపి నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్చార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్ తెలుగు దేశం పార్టి సీనియర్ నాయకులు, మాజీ ఎం.ఎల్.సి ఆదిరెడ్డి అప్పారావు మరియు లాయర్ల బృందంతో కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయడం చేతకాక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష నాయకులపై అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. గంజాయితో నేరుగా పోలీసుల అరెస్టు చేసిన విక్రం రెడ్డి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అనుచరుడన్న సంగతి అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి పేరుతో అక్రమంగా ప్రజల సొమ్మును దారిమలిస్తూ అసాంఘిక శక్తులను, బ్లేడు బాచులను, గంజాయి బ్యాచ్ లను అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తూ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన రాజమండ్రి పరువు బజారకీడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన మద్యం పాలసీ వలన ప్రజలు పడితున్న ఇబ్బందులను రాజమండ్రి నగర శాసనసభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో ప్రస్తావించగా సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై దిశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై అందరికి అందుబాటులో ఉండే ఆదిరెడ్డి కుటుంబంపై అధికార పార్టీ నాయకులు బురదజల్లే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సాక్షాత్తు ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మహిళా ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుకే స్పందన రాకుంటే దిశా చట్టం సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తుందో అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా అనుశ్రీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్ ఉపాధ్యక్షులు దాసరి గురునాధరావు ప్రధాన కార్యదర్శులు పైడిరాజు షేక్ బాషా లిమ్రా సిటీ కార్యదర్శులు గుణ్ణం శ్యాంసుందర్ విన్న వాసు మరియు జనసేన నాయకులు విక్టరీ వాసు విజయ్ ఆకిరెడ్డి ప్రసాద్ విజయ్ దుర్గాప్రసాద్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.