అంగనవాడి సమ్మెకు జనసేన మద్దతు

పాడేరు, గూడెం కొత్త వీధి, మండల కేంద్రం అంగనవాడి సిబ్బంది 22 రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరంలో మద్దతు తెలిపిన రూరల్ జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ మరియు మండల నాయకులు, కిల్లో రాజన్ మాట్లాడుతూ 2019 ఎలక్షన్ ముందు అక్క చెల్లెమ్మలకు అన్నగా ఉంటానని కంట కన్నీరు రానీయనని మాయమాటలు చెప్పి ముద్దులు, పెడుతూ, వెళ్ళడమే కాకుండా, కొండంత ఆశలు పెట్టారు, ఈరోజు తనను నమ్మిన అక్క చెల్లెమ్మలు రోడ్ మీద పడి ఆకలి దప్పికలతో, పొట్ట అరచేతపట్టుకొని, ఇచ్చిన హామీల నెరవేర్పు కోసం న్యాయంగా, రాజ్యాంగ బద్దంగా, పోరాటం సాగిస్తుంటే కనీసం చీమకుట్టినంత, చలనం లేదని ఆరోపించారు, తెలంగాణ రాష్ట్రంలో కన్న ఎక్కువగా జీతాలు ఇస్తానని నమ్మబలికి ఈరోజు అంగన్వాడిల నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు, కచ్చితంగా మీరు చేస్తున్న పోరాటం రాజ్యాంగ బద్దంగా న్యాయమైనది, కాబట్టి బెదిరింపులకు బయపడవద్దు, మీ పోరాటం ఫలిస్తుంది, మీకు అండగా జనసేన పార్టీ తోడుగా ఉంటుందని, హామీ ఇచ్చారు, అనంతరం, దరకొండ, దుప్పిల వాడ, రొసియగూడలకు చెందిన సీలేరు, వసగెడ్డ, గ్రామాల పెద్దలతో సమావేశమయ్యారు, మండల అధ్యక్షులు కోయ్యం బాలరాజు, ఉపాధ్యక్షులు, బత్తుల సిద్దార్థ మార్క్, కార్యదర్శి, కూడ మధుకుమర్, వనపల, ఈశ్వరావు, అరడ కోటేశ్వరరావు, గుండ్ల రఘువంశి, కొయ్యం, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.