నేమూరి శంకర్ గౌడ్ కి మద్ధతు తెలిపిన వివిధ గ్రామాల ప్రజలు

తెలంగాణ, జనసేన పార్టీ ఆఫీసులో జనసేన మరియు బిజెపి కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చి నేమూరి శంకర్ గౌడ్ కి మద్దతు తెలిపారు. ఓయూ జేఏసీ నాయకులు మరియు దళిత నాయకులు జుట్టుపల్లి వెంకట్, బిజెపి నాయకులు వీరేందర్ పటేల్, బీసీ నాయకులు నారాగౌని కూడా హాజరయ్యారు. బీసీ నాయకుని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో భారీ విజయానికి తోడ్పడాలని అన్ని కులాల వారికి పిలుపునిచ్చారు. గత ఆరు రోజులుగా రకరకాల పుకార్లు ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కి కమిషన్ కి తాండూర్ నియోజకవర్గ బిజెపి-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.