కేంద్రీయ విద్యాలయం కూడా పోగొట్టారు అంటగా నిజమేనా..?: మరీదు శివరామకృష్ణ

నూజివీడు ఎమ్మెల్యే గారి మెతక వైఖరి, నోరు మెదపని కారణంగా “కేంద్రీయ విద్యాలయం” వేరే ప్రాంతానికి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్థానిక ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో, అడ్మిషన్లు ప్రారంభం అవుతునట్లు ప్రకటించిన విద్యాలయాల లిస్ట్ లో నూజివీడు ఏందుకు లేదో తెలియచేస్తూ నిజా, నిజాలు ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ప్రతాప్ గారి పైన ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్ నివాస్, మీరు కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన బిల్డింగ్స్ పరిశీలించి ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించారు. కానీ అడ్మిషన్లు లో నుజివీడు కేంద్రీయ విద్యాలయం పేరు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంప్లాయిస్ కాలనీలో బిల్డింగు మరియు 80 లక్షలు నిధులు కూడా కేటాయించి, ఎమ్మెల్యే మరియు కలెక్టర్ విజిట్ చేసి ఈ సంవత్సరం నుండి అడ్మిషన్లు ప్రారంభం అని చెప్పిన తర్వాత కూడా ఈ విద్యాలయం మన ప్రాంతానికి ఇవ్వడం లేదు అంటే.. ఈ ప్రాంతానికి మళ్లీ అన్యాయం చేస్తున్నట్లే. నూజివీడు కృష్ణా జిల్లాలో ఉండాలి అని, నూజివీడు రోడ్లు, అభివృద్ధి సమస్యలపై పోరాడే జేఏసీ నాయకుల మీద మరియు ప్రతిపక్ష నాయకుల మీద లేస్తున్న నోరు ముఖ్యమంత్రి గారిని నూజివీడు అభివృద్ధికి కావాల్సిన వనరులు, నిధులు, అవసరాలు గురించి అడగానికి లేవట్లేదు ఎందుకని…? నిన్న మెడికల్ కాలేజీ అన్నారు పోయింది, నేడు కేంద్రీయ విద్యాలయం అన్నారు ఇది కూడా పోయింది అని వార్తలు వస్తున్నాయి. రేపు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ పరిస్థితి ఏంటి…? మీరు ఇప్పటికైనా నోరు తెరిచి నూజివీడు ప్రాంతానికి జిల్లాల పునర్విభజన ద్వారా జరిగిన అన్యాయం, మెడికల్ కాలేజీ వేరే ప్రాంతానికీ ఇవ్వడం, రోడ్లు అధ్వాన్న స్థితి, ఇండోర్ స్టేడియం కి నిధులు ఇతర అన్ని విధాల జరుగుతున్న అన్యాయం పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నూజివీడు అభివృద్ధి కోసం కృషి చెయ్యాలని జనసేన పార్టీ, కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ కోరారు.