లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • జనసేన పార్టీ ఇంచార్జ్ – బండారు శ్రీనివాస్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజవర్గం రెండు వారాలుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగి పలు లంక గ్రామాలు నీటమునిగాయి కనుక లంకవాసులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పశువులు, పంటలు రక్షణ కోసం ఒంటరిగా వెళ్లి ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికార యంత్రాంగం లంకవాసులకు నిత్యవసర వస్తువులు, బియ్యం వెంటనే అందించాలని, వైద్య శిబిరాలని అందుబాటులో ఉంచాలని,ఆలమూరు మండలం బడుగువానిలంక, మడికి, మూలస్థాన అగ్రహారం తదితర లంక గ్రామాలు ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని మరియు కొత్తపేట మండలం వానపల్లి నారాయణలంక, సత్తమ్మలంక, మందపల్లిలంక, ఆత్రేయపురం మండలం లంక ప్రజలను, రావులపాలెం మండలం ఊబలంక లంక ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని గోదావరి తగ్గుముఖం పట్టేదాకా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బండారు శ్రీనివాస్ కోరడం జరిగింది.