వరద బాధితులను పరామర్శించిన చిర్రి బాలరాజు

వేలేరుపాడు మండలంలో బుధవారం పోలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు వరద బాధితులను పరామర్శించటం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా, భాదితులకు కల్పించిన వసతి గృహాలు అయిన కస్తూరి భ స్కూల్, ఆశ్రమ పాఠశాలలో బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఏ బాధితుడిని కదిలించినా ముఖ్యంగా మాకు పోలవరం పూర్తి ప్యాకేజి ఇచ్చి, పూర్తి మౌలిక వసతులు కల్పించి మమ్మల్ని పునరావామునకు తరలించ వలసిందిగా కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి అని తెలిసి అధికారులు వరద ముంచుకు వచ్చే వరకు చోద్యం చూస్తూ వున్నారు. మరియు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా వచ్చారే కానీ వరద బాధితులకు నిత్యావసర సరుకులు కానీ, కేజీ బియ్యం కానీ ఇవ్వలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న పునరావాస కేంద్రాలలో విద్యుత్, సౌకర్యాలు లేని చోట్ల మరియు భోజన సౌకర్యాలు సరిగా లేని చోట్ల అట్టి విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజెసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. తదుపరి గోదావరిలో మునిగిన గ్రామాలను, ఇళ్లను పరిశీలించారు. 45 కాంటూర్ లేవిల్ లో ఉన్నటువంటి, గోదావరి పరివాహక ప్రాంతాలైన పేరంటపల్లి, టేకుపల్లి, కాకిసినూరు, టేకూర్, తూర్పు మెట్ట తదితర గ్రామాలతో పాటు పాత పూచిరాల, మద్ది గట్ల, తాటుకురుగొమ్ము కాలనీ, సుద్దగుంపు, శేఖరపల్లి, గ్రామాలను కూడా 41.15 కాంటూర్ పరిధిలోకి తీసుకువచ్చి, పూర్తిగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి తరలించాలని జనసేన పార్టీ తరపున డిమాంద్ చేయటం జరుగుతుంది. ప్రతి వరద బాధిత కుటుంబలకి తార్బల్, నిత్యావసర సరుకులు, ప్రతి వరద బాధిత కుటుంబానికి నష్ట పరిహారం 10 వేల రూపాయిలు చెల్లించాలని జనసేన డిమాంద్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ, మేచినేని సంజయ్, దేవిరెడ్డి సుధాకర్, పోడియం తులసి, బద్ధుల శివ రామ్, గడిదేశి చంటి, వంశీ, భాను, శ్రీను, మెహన్, కళ్యాణ్, సాయి, త్రిమూర్తి, రమేష్, నవీన్, వెంకటేష్, పండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.