కనీసం తాగునీటికి నోచుకోలేని ప్రజలు- ఇదేనా అభివృద్ధి?: బండి శేఖర్

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్ పట్టణ వాల్మీకి సర్కిల్ నందు అర్ధరాత్రి మహిళలు ఇక్కడ అందరూ గుంపుగా బిందెలు పట్టుకొని ఉన్నారు. ఎందుకు నిలబడ్డారని గుంతకల్ పట్టణ జనసేన అధ్యక్షులు బండి శేఖర్ అడగగా, అయ్యా
దాదాపుగా మూడు నెలలకు పైచిలుకు ఇక్కడ త్రాగునీటి సమస్య ఉంది అని ఇక్కడ మహిళలు అందరూ అధికారుల దగ్గర మొరపెట్టుకున్నా చలనం లేని అధికారులను ఏమనాలో అర్థం కావడం లేదు. మీ పార్టీ వారైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లండి అక్కడ స్థానికులు మొరపెట్టుకున్నారు. కచ్చితంగా మేము దీనిని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తాను అని చెప్పడం జరిగింది. గుంతకల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే ట్యాంకుల ద్వారా ప్రజలు నీళ్లు తెప్పించుకొని జీవనం కొనసాగిస్తుంటారు. గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి అంటే కనీసం తాగునీటికి నోచుకోలేని ప్రజలు. ఈ అధికార పార్టీ నాయకులు స్టేజ్ మీద ఎక్కితే పవన్ కళ్యాణ్ గారికి ఊగుతూ మాట్లాడే తాడు నీకు ఎమ్మెల్యేగా నిలబడే అడ్రస్ ప్రూఫ్ లేదు మాకు ఉంది, ఈ నియోజకవర్గంలో అని ఇక్కడి నుండి పోటీ చేయమని ఛాలెంజ్ విసిరితే హేళన చేసి మాట్లాడుతూ విమర్శించడానికే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు. ఈరోజు అధికార పార్టీ సర్పంచులు కూడా బయటకు వచ్చి మా పార్టీ గురించి స్టేజీలపై మీద మాట్లాడుతున్నారు, గ్రామాలలో మేము ఖర్చు పెట్టి చేసిన అభివృద్ధి బిల్లులు కూడా రాలేదు అని వారి గోడుని వినిపించుకుంటున్నారు. కానీ నేను నేడు చెబుతున్నా అదే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే జనసేన పార్టీ బీఫామ్ తీసుకొని మీకు పోటీగా నేనే నిలబడతాను మా అధ్యక్షులు వరకు ఎందుకు మీకు పోటీ నేను నిలబడతాను గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి మంచి మేనిఫెస్టో విడుదల చేసి ప్రజల ముందుకు వెళ్తాను. ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడ ఖచ్చితంగా సమస్యకి పరిష్కార దిశగా ముందుకు వెళుతూ, నియోజకవర్గంలో మెరుగైన వైద్యశాల, యువతకు ఉపాధి విద్య అంటారా విద్యార్థుల తల్లిదండ్రులకు కార్పొరేటర్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా అలాంటి కార్పొరేట్ స్కూల్స్ ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ప్రైస్ లిస్ట్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటాం. ఇంకా ప్రజలకు ఉపయోగపడే రోడ్స్ కానీ డ్రైనేజీ సమస్య గాని వాటర్ సమస్య కానీ ఎప్పటికప్పుడు పరీక్షించి అలాంటి ఏరియాలకు ప్రజలకు అండగా ఉంటాం అలాగే రాజేంద్రనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మన తిమ్మాపురం బైపాస్ దగ్గర పెద్ద ఆర్చ్ కట్టి అక్కడి నుండి నేరుగా టెంపుల్ దగ్గర వరకు డబల్ రోడ్డు వేసి టెంపుల్ ప్రసిద్ధి చెందేలాగా తీర్చిదిద్ధం కచ్చితంగా ప్రజలు జనసేనకు అధికారం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపెడతామని చెబుతున్నానని బండి శేఖర్ పేర్కొన్నారు.