ఏటుకూరులో ప్రాణం కాపాడిన జనసైనికులు

ప్రత్తిపాడు నియోజకవర్గం: గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు గ్రామంలోని జనసైనికుడు ప్రతివాడ ఈశ్వర్ కుమార్ కు బైపాస్ సర్జరీ గుండె ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ బ్లడ్ అవసరమైనది. పరిస్థితిని గమనించిన అంకిరెడ్డి వాలీ సుగుణరావు, ఇమ్మడి గిరీష్, అములోతు హేమంత్, తన్నీరు మార్కండేయలు, కుమార్, అరుణ్ తదితర జనసైనికులు విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా యన్.ఆర్.ఐ. హాస్పిటల్ కు వచ్చి ఆదివారం రక్తదానం చేసి మానవతను చాటుకొన్నారు. సరైన టైంలో రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన జనసైనికులను జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, జిల్లా ఆధికార ప్రతినిధి ఆళ్ళ హరి గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కాపు సంక్షేమ సేన జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు తదితరులు అభినందించారు. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఏన్నో చేపట్టాలని ఆదిశగా అడుగులు వేయాలని జనసేన నాయకులు అన్నారు.