సర్వేపల్లిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుల నియామకం

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో షాది మంది నందు నూతనంగా సర్వేపల్లి నియోజకవర్గం చిరంజీవి, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుల నియామకం ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఏటూరు రవి, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కారంపూడి కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు గుడి హరీ రెడ్డి, గూడూరు చిరంజీవ అధ్యక్షులు నయుమ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న షాదిమందిర్ నందు సర్వేపల్లి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడుగా షేక్ ఖాజా రహ్మతుల్లా, ఉపాధ్యక్షులుగా సంజు రాకేష్, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులుగా బొల అశోక్, ఉపాధ్యక్షులుగా సుమన్, నియామకం జరిగింది. రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చిరంజీవి యుక్త పవన్ కళ్యాణ్ యూత్ అధ్యక్షులను నియమించడం జరుగుతుంది. ఈ యువత ముఖ్య ఉద్దేశం 2024లో జనసేన పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఈ యొక్క యువత ముందుంటుంది. అన్ని గ్రామాల్లో కూడా మెగా అభిమానులు అందరిని కూడా ఏకతాటిపై తీసుకువచ్చి ఒకే వేదికగా వాళ్లందర్నీ నిలబెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రహీం, శ్రీహరి, సుధాకర్, కోటి, సంజూ రాకేష్, రహమాన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.