రేపటి నుంచి చార్‌ధామ్ యాత్రకు అనుమతి

శనివారం నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుందని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. కరోనా కారణంగా చార్‌ధామ్ యాత్రపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. చార్‌ధామ్ యాత్రపై ఉన్న నిషేథాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో శనివారం నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని సిఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు ఈ యాత్ర చేయాలని ఆయన సూచించారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి రోజూ పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఆయన చెప్పారు. భక్తులు కరోనా నెగటివ్ రిపోర్ట్‌, టీకా ద్రువపత్రాన్ని అధికారులకు చూపించాలని ఆయన పేర్కొన్నారు. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్‌, బద్రీనాథ్ తదితర పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటారు.