స్కూలు వద్ద స్పీడు బ్రేకర్స్ నిర్మించాలని సచివాలయంలో వినతిపత్రం

విజయనగరం నియోజకవర్గం, పదవ డివిజన్ లో గల స్థానిక బొందిల గూడెం వద్ద ఉన్న లిటిల్ హార్ట్స్ స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ లేని కారణంగా స్కూల్ పిల్లలు యాక్సిడెంట్లో గురవుతున్నారు, దీనిని గమనించిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి హుసేన్ ఖాన్ వెంటనే స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు భవాని పండు మౌల తదితరులు పాల్గొన్నారు.