ప్రజలనుండి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ – జైలునుండి వచ్చిన నాయకుడు జగన్

*జనసేన నాయకులు ఆదాడ మోహనరావు

విజయనగరం, జనవాణి కార్యక్రమం నిమిత్తం ఉత్తరాంధ్రా పర్యటనకు వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన జననీరాజనం చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ నాయకులు జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగిందని, వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన ఉత్తరాంధ్రా గర్జన విఫలమవడంతో జనసేనపైన, నాయకులపైన, జనసైనుకులపైన బురదచల్లే ప్రయత్నాలు చేసి, అక్రమకేసులు బనాయించి అధికార మధంతో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను పావుల్లా వాడుకొని అధికారాన్ని దుర్వినియోగపాలు చేస్తున్నారని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. మీతాటాకు చప్పుళ్లకు జనసేన భయపడేది లేదని అదినేత పవన్ కళ్యాన్ పిలుపుమేరకు మేమంతా యుద్దానికి సిద్దమని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ జగన్ రెడ్డిలా జైల్ నుండి రాలేదని, ప్రజలనుండి బలమైన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అందుకే జనసేనలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తన్నారని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), పత్రి సాయి కుమార్ పాల్గొన్నారు.