పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ శనివారం ఐ పోలవరం మండలం, జి వేమవరం గ్రామంలో హార్ట్ సర్జరీ చేయించుకున్న గాలి దేవర వెంకటలక్ష్మిని పరామర్శించారు. అదేవిధంగా హార్ట్ ఎటాక్ తో మరణించిన మింగి వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన ఆరోగ్యంతో మరణించిన లంకలపల్లి సత్యవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా గోగులలంక గ్రామంలో అనారోగ్యంతో మరణించిన నున్న బయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన పడాలసీతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు మురమళ్ళ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సలాది దుర్గాదేవి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, లంకలపల్లి జమ్మి, కర్రి శేఖర్, రామకృష్ణ, కాశిం తాతాజి, శిరంగు సురేష్, అశేట్టి సత్తిష్, గోగుల లంక వడ్డీ చిన్న, నున్న శ్రీను సలాది రాజా మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.