రైతులకు ఎల్లప్పుడూ జనసేన అండగా ఉంటుంది.. రైతు దినోత్సవ వేడుకలలో పితాని

  • జి.వేమవరంలో రైతు దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా ఐ.పోలవరం మండలం, జి వేమవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో పంట పొలాల మధ్యలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారలకమిటి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరై, జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకుని, రైతులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. జనసేన పార్టీ రైతుల పక్షపాతి అని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని పితాని బాలకృష్ణ రైతుల విజ్ఞప్తి చేసారు.