పితాని బాలకృష్ణ హౌస్ అరెస్ట్

ముమ్మిడివరం, మండపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అండతో జరుగుతున్న అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అక్రమ అరెస్టుకు నిరసనగా మద్దతుతెలిపి బుధవారం వల్లూరులోని లీలాకృష్ణ ఇంటికి చేరుకోవాలని జనసేన శ్రేణులకు జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఇచ్చిన పిలుపు మేరకు లీలాకృష్ణ ఇంటికి సంఘీభావం తెలుపుటకు వెళ్తున్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణని అమలాపురం శెస్సై, పోలీస్ సిబ్బంది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొలకోటి సాయిబాబు, గాలిదేవర బుల్లి, గోదాశి పుండరీష్, మాదాల శ్రీధర్, బండారు వెంకన్నబాబు ఉన్నారు.