మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ‘పితాని‘

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ర్ట మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు మద్దతుగా నిలిచి సభ నిర్వహణకు తమ భూములు ఇచ్చిన రైతులందరి పైన ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇందులో భాగంగా వారి ఇళ్ళను కూలగొట్టారని, రాష్ట్రంలో ఎక్కడ చుసినా అభివృద్ధి లేదని గుంతలు పడిన రోడ్లు కనిపిస్తున్నాయని ప్రజలకు ఎటువంటి మేలు చేయని ఇటువంటి కక్షసాధింపు చర్యల వల్ల వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించు కోక తప్పదని అన్నారు. ఇప్పటం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఇల్లు కూలగొట్టలేదని మంత్రి జోగి రమేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ అభివృద్ధికి కృతజ్ఞతగా 50 లక్షల రూపాయల చెక్కును గ్రామస్తుల సమక్షంలో అందించడం జరిగిందని. కనీసం అవగాహన లేకుండా మంత్రి మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన పని చేసే పార్టీ జనసేన అని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఏమన్నా దమ్ముంటే టిక్కెట్లు మార్చకుండా గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను వారికే కేటాయించి గెలిచే దమ్ము ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.