దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్న పితాని దంపతులు

ముమ్మిడివరం: బట్నవిల్లి శ్రీ విజయ దుర్గమ్మ వారి ఆలయం నందు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం, సరస్వతీ దేవి అలంకరణతో అమ్మవారు కొలువై ఉన్నారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ, సరస్వతి దంపతులు భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.