జనసేనను బలోపేతం చేయడంలో పితాని బిజి బిజి..!

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా కర్రివానిరేవు, చింతలపూడి పాలెం, పల్లవారిపాలెం, లంకాఫ్ ఠాణేలంక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేలంక గ్రామానికి చెందిన పందిరి సుభాష్, కుంచే సాయి, యడ్ల దినేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది యువకులు వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. వారికి పితాని బాలకృష్ణ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, నాతి నాగేశ్వరరావు, గొలకోటి వెంకన్నబాబు, దూడల స్వామి, పాయసం సాయి, కొప్పిశెట్టి రాంబాబు, బొక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు.