పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో మన్యం వీరునికి ఘననివాళి

కాకినాడ, పిఠాపురం నియోజవర్గం 1922 నుండి 1924 వరకూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యం ప్రాంతంలో బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల సాధన కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం గెరిల్లా యుద్ధం చేసి తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప దేశభక్తుడు. ఆయన జీవితం ఎప్పటికీ మనకు స్ఫూర్తి దాయకం ఒక భారతీయుడిగా, ఒక తెలుగు వాడిగా అల్లూరి సీతారామరాజు జరిపిన మన్యం పోరాటం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం కేవలం తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న అల్లూరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో గౌరవించబడటం ఆ మహనీయునికి మనం అర్పించే ఘన నివాళి జోహార్ అల్లూరి అంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ నాయకులు పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, మేళం బాబీ, యాండ్రపు శ్రీనివాస్, తోట సతీష్, అబ్బినీడి ప్రసాద్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.