పిఠాపురం పవన్ కళ్యాణ్ దే పక్కా

జియోగ్రఫీ: కాకినాడ నుండి 20 కిలోమీటర్ల మరియు రాజమండ్రి నుండి 75 కిమీ దూరంలో ఉన్నది. పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం.
చరిత్ర: ఇది భారతదేశంలో 18 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కుక్కుటేశ్వర స్వామి, కుంతిమాధవ స్వామి, శ్రీపాద శ్రీ వల్లభ అనాఘ దత్తాక్షేత్రం, అగ్రహరం, శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయాలకు ప్రసిద్ది చెందింది.
వాలంటీర్ వ్యవస్థ: పిఠాపురం మండలం అర్బన్ ఏరియా
మొత్తం సెక్రేటేరియట్స్: 15
మొత్తం సేంక్షండ్ స్ట్రెంత్: 279
వాలంటీర్స్ సంఖ్య: 273
సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి ద్వారా గ్రాంటెడ్ అయిన వాలంటీర్స్: 269
క్లస్టర్స్ కు మేప్ చెయబడ్డ వాలంటీర్స్: 268
నియోజవర్గ పరిదిలో గల మండలాలు: 1.పిఠాపురం 2. గొల్లప్రోలు 3. యూ.కొత్తపల్లి.
పిఠాపురం పరిదిలో గ్రామాలు: బి. కొత్తూరు, జగపతిరాజపురం, వెల్దుర్తి, ప్రో. దొంతమూరు, ప్రో. రాయవరం, భోగాపురం, రాపర్తి, జములపల్లి, గోకివాఢ, మంగితుర్తి, విరవ, కోలంక, మాధవపురం, అగ్రహారం (రూరల్), విరవాడ, మల్లం, ఫకురుద్దీన్ పాలెం, జల్లూరు, గోవిందరాజుపాలెం, కందరాడ, చిత్రాడ, నవకందరాడ.
గొల్లప్రోలు పరిదిలో గ్రామాలు: కొడవలి, చెందుర్తి, దుర్గాడ, విజయనగరం, చేబ్రోలు, వన్నెపూడి, చిన జగ్గంపేట, తాటిపర్తి, గొల్లప్రోలు, మల్లవరం.
యూ.కొత్తపల్లి పరిదిలో గ్రామాలు: ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట, పొన్నాడ, ములపేట, అమరవల్లి, యెండపల్లి, వాకతిప్ప, కొందెవరం, గొర్స, కొమరగిరి, కుతుకుదుమిల్లి, కొత్తపల్లి, అమినబద, ఉప్పాడ, సుబ్బంపేట.
జనాభ సంఖ్య: 236602 ఓటర్స్ (పురుషులు – 119192 & స్త్రీలు – 117410)
కుల సమీకరణాలు: కాపు 32%, శెట్టిబలిజలు 9.7%,మత్స్యకారులు 7.5%,తూర్పు కాపులు 3.6%, ఎస్.సి /ఎస్.టి 3% రాజులు 2%, కమ్మ 0.3%.
గత ఎన్నికలు: చరిత్రలోకి తొంగిచూస్తే మొత్తం 16 శాసనసభ్యులు ఇప్పటివరకు ఎన్నికైతే, అందులో 12 మంది కాపు సామాజికవర్గానికి చెందినవారే.
2019 – పెండ్యం దొరబాబు (83459 ఓట్లు 44.7%), వర్మ (68467 ఓట్లు 36.70%), మాకినీడి శేషుకుమారి (28111 ఓట్లు 15%).
పిఠాపురం సమస్యలు:

  1. కొత్తపల్లి – ఉప్పాడ రైల్వే క్రాసింగ్: కొత్తపల్లి నుండి ఉప్పాడ మధ్య రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి.
  2. చిత్రాడ చెరువు సుందరీకరణ: చెరువు వద్ద పూడిక తీసి సుందరీకరణ చెయ్యాలి.
  3. ట్రాఫిక్ సమస్య: రోడ్స్ విస్తరణ జరగాలి, మెయిన్ రోడ్ ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.
    4.పిఠాపురం మినీ స్టేడియం, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించడం, ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచి నీరు సరఫరా, ఈబీసీ పరిహారం, నక్కలకండి, సుద్దగడ్డ కాలువలను వెడల్పు చేయడంతోపాటు గ్రామాల్లో ఇరుకు రోడ్లు విస్తరించడం, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడం ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు.
  4. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న పిఠాపురం, గొల్లప్రోలు మండలాల రైతులకు ఏలేరు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో 65 వేల ఎకరాలు సాగులో ఉంది. 30 యేళ్ల నుంచి ఈ ఆయకట్టు ఆధునీకరించకపోవడంతో రెండో పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కాలువల్లో ఉన్న పూడిక తీయించాలని, గుర్రపు డెక్కను తొలగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
  5. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఏలేరు చివరి భూములు ముంపునకు గురవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసినా చేతికి అందివచ్చిన పంట నీళ్లపాలవుతుండని రైతులు వాపోతున్నారు.
  6. యూ కొత్తపల్లి మండలంలో సముద్ర అలల తాకిడికి ఉప్పాడ, కొనపాపపేటా గ్రామాల్లో కొంతమేర ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయంటే తీవ్రత ఎలా ఉండో అర్థం చేసుకోవచ్చు.
  7. సెజ్ పేరుతో 12 వేల ఎకరాల భూములు సేకరించినా ఇప్పటివరకు ఏ ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. ఆ భూములు నిరుపయోగంగా మారాయని పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిల్లో తమకు ఉపాధి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
    వై.సి.పి భూఆక్రమనలు: పిఠాపురం మ‌హారాజా కుమారుడైన రామ ర‌త్నారావు గారికి జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న సీత‌య్యగారి తోట‌లోని రూ.12 కోట్లు విలువైన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి దోచుకొన్నారు.
    వై.సి.పి ఇసుక దందాలు: తీరప్రాంతంలో అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక దందాలు అరికట్టాలి.

నేటి పిఠాపురం ప్రజల నాడి: పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే పిఠాపురం పూర్వ వైభవం తెచ్చుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతుంది అని ఓటర్స్ బలంగా విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా, వ్యవసాయానికి పెద్దపీట వేస్తారని, కొత్త పరిశ్రమలతో స్తానికులకు ఉపాది కల్పిస్తారని ఆశిస్తున్నారు.

చివరిగా ఒక్కమాట: అయ్యా జగన్, వందల కోట్లు ఇక్కడ కుమ్మరించి ఎలాగైనా నీ దండుపాళ్యం బ్లేడ్ బేచ్ దింపే బదులు, ఒక్క 400 కోట్లు నువ్వు ఇచ్చి ఉంటే, సచివాలయం తాకట్టుకు వెళ్ళేది కాదుకదా?

కూటమి కూర్పుకు కృష్ణుడు,
జనగళమే తనగళమని ఎలుగెత్తిన జనసేనాని,
పిఠాపురానికి పూర్వవైభవం పవన్ కళ్యాణ్ తోనే సాద్యం.

ఇట్లు,
సురేష్ కరోతు (ఉత్తర అమెరిక)