జనసేన ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం

వైజాగ్ వెస్ట్: జనసేన పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసైనికుడు పవన్ ఆనంద్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆదివారం గోపాలపట్నం 92వ వార్డులో వెంకటాపురం, సాయి నగర్, వెంకటాద్రి గార్డెన్స్, ఎస్సీ బీసీ కాలనీ, పద్మనాభ నగర్ మరియు అజంతా పార్క్ కాలనీ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.