జనసేనానికి అండగా పెద్దన్న పాత్ర పోషించఒడి… జనసేన పార్టీ శెట్టిబలిజ బీసీ సేవాదళ్ నాయకులు పిలుపు!

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని పలువురు బీసీ శెట్టి బలిజ సోదరులు మాట్లాడుతూ, ఎప్పటి నుంచో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న కేవలం రెండు కులాలు మాత్రమేనా! మన ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించాలా? ముఖ్యమంత్రి పీఠానికి, ఇతరులు ఎవరికీ అర్హత లేదా? పరిపాలించకూడదా? వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని సామాజిక వర్గాలను ఐకమత్యంగా ముందుకు నడిపించే గొప్పనాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పని చేయడానికి అర్హత లేదా? ఎంతకాలం ఈ బానిస బతుకులు! అన్ని సామాజిక వర్గాల వారికి సమానంగా రాజ్యాధికారం కావాలంటే, ఒక్క జనసేనాని మాత్రమే న్యాయం చేయగలరని గుర్తుంచుకోండి! సోదరులారా! ఇప్పటికీ,ఎప్పటికీ జనసేనాని లాంటి నాయకుడను కాపాడుకోకపోతే, భవిష్యత్తు రాబోయే తరాలకు సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి కాగలిగే వ్యక్తి ఇక రెండు దశాబ్దాల కాలంగా ఎంత వెతికినా దొరకడు! తెలుసుకోండి, సోదరులారా రండి! మిత్రులారా ఐక్యం అవ్వండి! పెద్దన్న పాత్ర పోషించఒడి! నీతికి నిజాయితీకి నిలబడిన జనసేనానికి మద్దతుగా అండగా నిలబడండి.