ధనల హరిదీప్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్నంలో అతి చిన్న వయసులోనే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఫేమస్ సింగర్ మరియు యూట్యూబర్ ధనల హరిదీప్ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించి, కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపికృష్ణ, వీరామిరెడ్డి అమర్, ముమ్మిడి నల్లబాబు, ఎర్రం శెట్టి కిరణ్, ధనాల ప్రవీణ్, ఇంటి ప్రకాష్, ఎర్రం శెట్టి యశ్వంత్, రమణ, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.