పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొదలాడ గ్రామ రైతులు

రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామం రైతులందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేశారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున విరాళం ప్రకటించిన రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, మేడిచర్ల రామకృష్ణ, సూరిశెట్టి లక్ష్మణరావు, శ్రీరామ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.