తప్పుడు కంప్లైంట్ లతో జనసైనికులను చితక బాదిన పోలీసులు

బాపట్ల: నగరం మండలం, నగరం పంచాయతీలో మల్లాది ఓం సాయి వర్ధన్ వయసు 18 సంవత్సరాలు. నిడమానూరు చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం వాట్సప్ గ్రూపులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడని ఆ పోస్టులకు నగరం మండల జనసైనికులు సాయి ప్రసాదు, లింగ, నల్లోడుకి మధ్య మాటలు జరిగి, మాటలు పెరిగి, ఈ నలుగురు కలిసి నన్ను చంపేస్తారనే భయంతో నేను కంప్లైంట్ ఇస్తున్నాను అని వాట్సప్ కంప్లైంట్ ద్వారా నగరం ఎస్సై రామకృష్ణకు కంప్లైంట్ అందింది. ఈ వాట్స్అప్ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని జనసేన కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ఎస్సై మరియు కానిస్టేబుల్ లు లాఠీలతో కొట్టారని, నగరం ఎస్సై అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారని, ఈ కంప్లైంట్ లో ఎటువంటి నిజం లేదని కంప్లైంట్ లో నిజం ఉందో లేదో తెలుసుకోకుండా వారిని తీసుకువచ్చి చితకబాది, భయభ్రాంతులకు గురిచేసి జనసేనను అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని నగరం మండల అధ్యక్షుడు ఉదయ్ కృష్ణ తెలిపారు. ఈ విధంగా ఎన్ని హింసలు పెట్టినా మేము జనసేనను వదిలిపెట్టి వెళ్ళమని జనసేన జోలికి వస్తే ధర్నాకు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని మా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా వస్తారని, దీనిని మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలని జరగకుండా చూడాలని ఆయన అన్నారు. కంప్లైంట్ లో ఎటువంటి వాస్తవాలు లేకపోయినా ఒక డమ్మీ కంప్లైంట్ ని తయారుచేసి జనసైనికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జనసైనికులు ఎవరూ ఇలాంటి వాటికి భయపడరని ఆయన తెలిపారు. పోలీసు వారు అదుపులోకి తీసుకున్న వారికి మద్దతుగా వచ్చిన రేపల్లె టౌన్ అధ్యక్షులు మహేష్ కు, నగరం మండల కమీటీ సభ్యులు, జనసైనికులకు మండల అధ్యక్షులు ఉదయ్ కృష్ణ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.