పలు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం రూరల్ జగన్నాయకుల పాలెం గ్రామం వాస్తవ్యులు కిమిడి శ్రీనివాస్ బిల్డింగ్ పని చేస్తూ పడిపోవడం జరిగింది. మరియు నక్కా ముత్తేష్ బైక్ యాక్సిడెంట్ అయ్యి గాయాలు అవ్వడం జరిగింది. ద్రాక్షారామ గ్రామం మాదవి లత హాస్పిటల్ కి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి వారి యెుక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి బుంగరాజు, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, రూరల్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్,అనిశెట్టి బాబ్జీ, బోనం శ్రీనివాస్, తోట రామకృష్ణ, పరమేష్, రాంబాబు నాయుడు కొలగాని సతీష్, పోలిశెట్టి స్వామి తదితర జనసైనికులు పోలిశెట్టి చంద్రశేఖర్ తో వెళ్ళడం జరిగింది.