పూర్ణచంద్ర కుటుంబానికి షేక్ రియాజ్ చేతుల మీదుగా వరికూటి ఆర్ధికసాయం

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు. అనంతరం ఇటీవల నూతన సంవత్సరం రోజున కొండేపి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మట్టిపల్లి పూర్ణచంద్ర అనే జనసైనికుడు పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ కడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఒంగోలులోని వెంకట రమణ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు బుధవారం పూర్ణచంద్రకి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా 15,000/- రూపాయలను అందజేయడం జరిగినది. జనసైనికులకు ఎప్పుడు అండగా ఉండే వరికూటి నాగరాజుకి పూర్ణచంద్ర కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు.