“మత్స్యకారులకు బాసటగా జనసేన” పోస్టర్ విడుదల

కాకినాడ సిటి, జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో మత్స్యకారుల సమస్యలపై జనసేన పార్టీ పోరాటం పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిధిగా కాకినాడ సిటి ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పాల్గొని వేట నిషేధసమయంలో ప్రతిఒక్క మత్స్యకారుడికీ జీవనభృతి ఇవ్వాలని మరియు మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నిస్తూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఇటీవలే వీరి సమస్యలపైన సభ కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలిసినదే అని అన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం నిషేధకాలంలో జీవనభృతి పదివేల రూపాయలు ఇస్తామంటూ కేటాయింపుల్లో 500 కోట్ల రూపాయలు చూపిస్తున్నప్పుడు మరి అర్హులందరికీ ఎందుకు అందడంలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇంకోపక్క మత్స్యకారులకు 10 లక్షల భీమా మొత్తంగా ప్రకటించినపుడు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఎందుకు చేతికి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మనసుంటే మార్గం ఉంటాదని పెద్దలు చెపుతారనీ దీనినిబట్టి చూస్తే ఈ వై.సి.పి కి మత్స్యకారుల కష్టాలవైపు ద్రుష్టి సారించే ఆలోచనే లేదనీ ఇక మనసు ఎక్కడుంటాదని ఎద్దేవా చేసారు. అందుకే మత్స్యకార వర్గాలకి సముద్రంపై వేట నిషేధ కాలంలో జీవనభృతి ప్రతి ఒక్క మత్స్యకారుడి హక్కు అని, అది అందిచవలసిందే అని స్పష్టం చేస్తూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈనెల 28న మత్స్యకారులకు న్యాయం చేయాలిసిందిగా కోరుతూ విఙ్ఞ్గ్యాపనపత్రాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇందులో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మత్స్యకారులకు మన మద్దతుని తెలిపి పోరాడుదామని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ సిటి అధ్యక్షులు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, ఉపాద్యక్షులు ఓలేటి రాము, సిటి ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్ మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.