Vizag: 61వ వార్డులో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన పార్టీ

గ్రేటర్ విశాఖ జివిఎంసి పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డులో జనసేన అభ్యర్ధి ములంపాక నాగవేణి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇంటి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు జనసేన పార్టీ అభ్యర్ధి ములంపాక నాగవేణి.

అయితే జనసేన అభ్యర్ధీ గెలుపుకి పార్టీ అహర్నిశలు కష్టపడుతుంది, ఇప్పటికే జిల్లా నాయకులు సుందరపు విజయ కుమార్, చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు, పిఏసి మెంబర్ కోన తాతరావు, సీనియర్ నాయకులు కరణం కనకరావు, భార్గవ్, మౌలీ, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు వార్డులో ప్రచారం పాల్గొన్నారు.

ఈ నేపధ్యంలో ఎన్నికలలో బాగంగా విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు పోతిన మహేష్ ప్రచారంలో పాల్గొన్నారు.

61వ వార్డు జివిఎంసి ఎన్నికలలో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని జనసేన పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.