భారీగా బరువు తగ్గే పనిలో ఉన్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయిన విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను ప్రకటించి అభిమానులను ఖుషి చేసాడు. ప్రస్తుతం క్రిష్ మూవీ తో పాటు అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ భారీగా బరువు తగ్గే పనిలో ఉన్నారట.

పోలీసాఫీస‌ర్ లుక్‌లో క‌నిపించేందుకు ప‌వ‌న్ బరువు త‌గ్గే ప‌ని పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భార్య‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ పొల్లాచ్చిలో జ‌రుగ‌నుంది. ప‌వ‌న్‌-రానాపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డే షూట్ చేయబోతున్నారు.