జగన్నాధపురంలో ప్రజా చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ నాయకురాలు చోడిపల్లి సత్యవతి ఆధ్వర్యంలో బుధవారం 18వ డివిజనులో జగన్నాధపురం చినమార్కెట్ ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా చైతన్య యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలను కలుస్తూ నేడు ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ప్రజలకు వివిధ పధకాలలో డబ్బులు వేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వదిలేసి, వాటిని అప్పులు చేసి వాటికి అయ్యే వడ్డీలు అసలు కట్టడానికి తిరిగి ప్రజల మీదే పన్నులు రకరకాలుగా పెంచి కొత్తవి వేసి రక్తాన్ని పిండేస్తోందనీ దీనివల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఇలా చేసి రాష్ట్రంలోని పేదరికాన్ని ఎంతశాతం నిర్మూలించారో చెప్పగలరా అని సవాలు చేసారు. ఇదంతా చూస్తే ఒకజేబులోంచి డబ్బులు తీసి ఇంకో జేబులో పెట్టుకున్నట్టు ఉందన్నారు. ప్రజలలో ఇలాంటి చైతన్యం కోసమే తాము ఈ యాత్ర చేపట్టామనీ, సంఘటితం అయితే ఎవరన్నా దిగిరావాలిసిందే అన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేందుకు మీ మద్దతు ఇవ్వవలసినదిగా అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, రమ్య, వందన, కృష్ణవేణి, శ్రావణి, గంగ, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.