నేడు బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్.. నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ

ఇటీవల తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేడు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నేడు నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్ప సభలో ఆయన బీఎస్పీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ సభకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభకు లక్ష మందికిపైగా బహుజన ఉద్యమకారులు, స్వేరో సంస్థ కార్యకర్తలు హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.