కౌన్సిలర్ దంపతులపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం: బాబు పాలూరి

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 31వ వార్డుకు చెందిన జి విజయలక్ష్మి ఇంటికి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి బాబు పాలూరి హామీ ఇవ్వడం జరిగింది. 31వ వార్డు కౌన్సిలర్ దంపతులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న అధికారులను ప్రశ్నిస్తూ.. ఘటన జరిగి రెండు రోజులు అయినా చర్యలు తీసుకోలేదు త్వరిత బాధిత మహిళలకు న్యాయం జరగకపోతే, జనసేన పార్టీ తరఫునుంచి పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి సిద్ధమవుతామని అధికారులకు, అధికార పార్టీ నాయకులకు తెలియజేసారు.