టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలపై జగన్ రెడ్డి ఫోటో ముద్రించటం దారుణం

  • వైసీపీకి ప్రచారం పిచ్చి పీక్స్ కి వెళ్ళింది – జనసేన కిరణ్ రాయల్

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించటం దారుణమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుందని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి లు బుధవారం అన్నారు. రేపటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని, పట్టాలపై ముద్రించిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలను, వైసీపీ నవరత్నాల ప్రచారాలను తొలగించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఇలానే వదిలిస్తే రేపు జగన్అన్న సుప్రభాత సేవ, జగనఅన్న తోమలసేవ అని.. మరోసారి అధికారంలోకి వస్తే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసి జగన్ ఫోటో పెడతారేమొనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఇంటి పట్టాలలో జగన్ ఫోటో తొలగించక పోతే కచ్చితంగా రేపు కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని వారు అధికార పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండా రాజమోహన్, కిషోర్, వంశీ లు పాల్గొన్నారు.