షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ!

తెలంగాణలో పార్టీ స్థాపించేందుకు వైఎస్ షర్మిల చురుగ్గా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాగా, షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బృందంలోని ప్రియ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షర్మిల పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 ప్రియ తమిళనాడులోని తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె. ఇవాళ హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసంలో షర్మిలను ప్రియ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జులై 8న వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల తన పార్టీ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. పార్టీ పేరును ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’గా ఇప్పటికే రిజిస్టర్ చేసినట్టు కథనాలు వచ్చాయి.