ఎపి నగర్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలి: జనసేన వినతిపత్రం

భైంసా నియోజకవర్గం: భైంసా పట్టణంలోని, 6వ వార్డు, ఎపి నగర్ కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా నీటి ప్రవాహం చాలా ఉద్భుతంగా ప్రవహించి నీరు మొత్తం ఇండ్లలోకి చేరి, రక్షణగా కట్టుకొన్న గోడ కూలి నీళ్ళు రావడంతో మొత్తం ఇండ్లలోని సామాను, కూలర్, బీరువా, నిత్యావసర వస్తువులు నీటి ప్రవహంలో కొట్టుకు పోయి నష్టం వాటిల్లింది. ఎపి నగర్ కాలనీలో నిర్మాణం చేసిన పెద్ద నాల ఎత్తుపై వండటం వల్ల కిందకి జోరున వర్షం నీళ్ళు రావడంతో ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వరద నీరు ఇండ్లలోకి చేరి మా బతుకులు అగమగమయ్యాయు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్తాయిలో నిర్మాణం చేయలేదు. మా గల్లిలో మోర్లు, రోడ్లు, అదేవిధంగ కరెంట్ స్థంబాలు కూడా లేవు. దాని వల్ల ఈ వర్ష కాలంలో చిన్న పిల్లలు, వృద్దులు, రోడ్లపై నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్టి సమస్యలపై వెంటనే స్పందించి ఇంజనీర్ నీ కాలనికి పంపించి, మోర్లు, డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ వచ్చేలా చూస్తారని కోరుకుంటాన్నాం కాలనీ వాసులు కవిత-లత, లక్ష్మి, మీరా బాయి, అనసూయ, సాయవ్వ, జయశీల, రజిత, విట్టబాయి, పురుషోత్తం, రాకేష్ రెడ్డి, తదితరులు శనివారం భైంసా మున్సిపల్ చైర్మన్ ను కోరుతూ వినతి పత్రం అందించారు. వీరికి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మద్దతుగా నిలచి వీరి తరఫున మాట్లాడారు.