ప్రొఫెసర్ జయ శంకర్ వర్ధంతి సభ

భైంసా పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ప్రొఫెసర్ జయ శంకర్ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయ శంకర్ అమర్ రహే అంటు నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి నీళ్ళు, నిధులు, నియామకాలు లేవు, మనపై దోపిడీ, దౌర్జన్యం, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని ఆయన తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఎవర్ని కలిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందో, వాళ్లందరినీ ఒక్క దగ్గరకు చేర్చి, మేధావులను, కవులను, కళాకారులను, ఉద్యమ నాయకులను కలిసి రాష్ట్ర సాధన కోసం అనేక సలహాలు సూచనలు ఇస్తూ సామాజిక తెలంగాణ కోసం ఊపిరి ఆగిపోయే వరకు ఉండి రాష్ట్రం ఏర్పాటు చేసిన మహనీయుడు అలాంటి వారి గొప్ప ఆలోచన విధానం మేధస్సును ప్రజలందరికీ తెలిసేలా గ్రామ గ్రామాన ఆయన వర్ధంతి ఉత్సవాలు ఘనంగా చేయాలని, ప్రముఖులు కొనియాడారు. కాని తెలంగాణ అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రం ఏర్పడ్డా కూడా మళ్ళీ తమ హక్కుల కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు దళిత బహుజన బడుగు బలహీన వర్గాలు ఇప్పటికీ పోరాటాలు కొనసాగిస్తున్నారు. సామాజిక తెలంగాణ కోసం ఆయన ఆశయ సాధన కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఐక్యంగా ఉండి బంగారు తెలంగాణ కోసం కృషి చేద్దాం. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీహరి, టీఎన్జీవో సభ్యులు సమత ఫౌండేషన్ చైర్మన్, సమత సుదర్శన్, బిసి సంఘం నాయకులు సుంకెట పోషెట్టి, దళిత సంఘం నాయకులు కపిల్, రాములు, శ్రీనివాస్, మహేందర్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.