ప్రొ.జయశంకర్ కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన డా. మాధవరెడ్డి

రిలింగంపల్లి: 10 వసంతాల తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన కో ఆర్డినేటర్ పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ.. రాష్ట్ర సాధనలో అమరులైన వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు అరుణ్ కుమార్, సరోజ్ ప్రదీప్, కల్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కుమార్ జి.ఎస్.కే, ప్రశాంత్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.