జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్థలాలను కాపాడండి: కలెక్టర్ కు మనోజ్ కుమార్ అర్జీ

  • పొన్నలూరు మండల కేంద్రం సర్వే నెంబర్ 266 విస్తీర్ణం య 1-92 సెంట్లు జడ్పీ గవర్నమెంట్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి దొంగ రిజిస్టర్లు చేసిన పొన్నలూరు జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేయాలి
  • ప్రభుత్వ ఉపాధ్యాయుడు మండవ వెంకట కృష్ణరావుని అరెస్టు చేయాలి

ప్రకాశం జిల్లా కలెక్టర్ ని సోమవారం పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ కలిసి జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్థలాలను కాపాడాలని అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పొన్నలూరు మండలం జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు సర్వే నెంబర్ 266 జడ్పీ స్థలం పొజిషన్ చూపించి సర్వేనెంబర్ 267/1ఎ లో ప్లాట్ నెంబర్ 4లో, 27 గదులు, మరియు సర్వేనెంబర్ 267/1ఎ లో ప్లాట్ నెంబర్ 8లో 29 గదులను కేశినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 2 ప్లాట్లను జడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు కేశినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. సర్వేనెంబర్ 267/1ఎ లో మండవ వెంకట కృష్ణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు 27 గదుల జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి కొత్తకోట శైలజ అనే వ్యక్తికి దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. సర్వేనెంబర్ 267/1ఎ లో 27 గదుల ప్రభుత్వ స్థలాన్ని మండవ వెంకట కృష్ణారావు ఆక్రమించి కొత్తకోట మాధవరావు అనే వ్యక్తికి దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి అమ్మినటువంటి ప్రస్తుత పొన్నలూరు మండలం జడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మండవ వెంకటకృష్ణారావులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేసారు.