కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన నాయకుల నిరసన

కాకినాడ రూరల్, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పై మరియు ఇతర నాయకులపైన పోలీస్ అధికారులు వ్యవహారించిన తీరుని, అక్రమ నిర్భంధాలను ఖండిస్తూ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, శ్రేణులు స్థానిక నాయకులు తూరంగి కొవ్వూరు గ్రామాల్లో (కాకినాడ నుండి రామచంద్రపురం వెళ్లే రహదారి మరియు కొవ్వూరు కొత్తపేట రామాలయం ప్రాంతం) రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తూరంగి, కొవ్వూరు జనసేన నాయకులు, పాల్గొన్నారు.