గాంధీనగర్ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో బండి సుజాత ఆధ్వర్యంలో 39వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. స్థానికులు మాట్లాడుతూ అధిక కరెంటు బిల్లుల బాధ భరించలేకపొతున్నామనీ, లోగడ ఎవరో నివసించిన సమయంలోని ఇంటి విద్యుత్ చార్జీలను నేడు తాము ఆఇంటిలో ఉన్న పాపానికి తాము కట్టాల్సిరావడం చాలా దారుణమన్నారు. అమ్మ ఒడి కొంతమందికి పడిందనీ, కొంతమందికి తక్కువగా పడిందనీ, ఇదేంటని అడిగితే సాంకేతికలోపం అనీ త్వరలో చక్కదిద్దుతామంటున్నారు తప్ప ఉపయోగం కనిపించలేదన్నారు. జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ వై.సి.పి ప్రభుత్వం రకరకాల కల్లిబొల్లి మాటలు చెప్పి కాలం గడిపేసిందనీ, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే మీనమేషాలు లెక్కపెట్టరనీ అన్నారు. ఇంకొక మూడు నెలలో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపెయ్యచ్చనీ ప్రజల ఓటు పవరేంటో ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసేలా చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, బండి సుజాత, మిరియాల హైమవతి, యేలేటి సోనీ ఫ్లోరెన్సు, బోడపాటి మరియ, బట్టు లీల, సబ్బే దీప్తి, మోర్త రమణమ్మ, దూలపల్లి ఉమ తదితరులు పాల్గొన్నారు.