ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి: జనసేన వినతి పత్రం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇంటింటా ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ గురువారం ఇచ్చాపురం నియోజకవర్గ జనసైనికులు ఇచ్చాపురం ఎలక్షన్ కమిషనర్ శ్రీమతి సుమబాల కు వినతి పత్రం అందించారు. ఈ స్నదర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటింటా ఓటరు నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి బి.ఎల్.వో ఎవరూ కూడా సక్రమంగా సర్వే నిర్వహించడం లేదు అలాగే వాలంటీర్లతో బి ఎల్ ఓ లు కబురు పెట్టి ఎవరికైనా అవసరం ఉన్నచో డాకుమెంట్స్ వాలంటీర్లతో స్థానిక సచివాలయానికి పంపించి ఓటర్ నమోదు చేసుకోవలసినదిగా చెప్పడం చాలా దారుణమైన విషయం. తదుపరి ఏదైతే ఇంటింటా ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించి కనీసం నియోజకవర్గం స్థాయిలో ప్రచార రధాలు పెట్టి మరియు ప్రచార పోస్టర్లు అతికించి ప్రజలకు అవగాహన కల్పించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కనీసం ఇప్పటికైనా బి.ఎల్.వో లు మరింత బాధ్యతగా ఈ కార్యక్రమంపై ప్రజలందరికీ అవగాహన కల్పించి మిగిలిన 20 రోజుల్లో ప్రతీఒక్కరికీ ఓటు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేపించవలసినదిగా ప్రార్ధిస్తున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ 10,11,22,వార్డ్ ల ఇంచార్జ్ లు దాసరి శేఖర్, రోకళ్ల భాస్కర్, కాళియ గౌడో, జనసైనికులు ఉపేంద్ర ఢిల్లీ, అజిత్, సతీష్, రాజు, శివ, బుల్లు పాల్గొన్నారు.