చీర కట్టులో మెరిసిన పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చీరకట్టులో ఆకట్టుకుంది. తెల్ల చీరకు తగ్గట్లే మ్యాచింగ్ బ్లౌజ్ వేసిన సింధు తన కొత్త అందాల్లో పర్ఫెక్ట్‌గా కనిపిస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీరలో సింధు తళతళ మెరిసిపోతోంది. పింక్‌, బ్లూ, పర్పుల్ త్రెడ్‌వర్క్ ఉన్న ఆ చీరలో .. చాలా సహజమైన అందంతో సింధు ఫోటోలకు ఫోజు ఇచ్చింది. రెండు రోజుల క్రితమే పోస్టు చేసిన ఆ పూల చీర ఫోటోకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఏడు లక్షల మంది ఆ ఫోటోకు లైక్ కొట్టేశారు.