పీవీ విగ్రహం ఆవిష్కరణ

మాజీ భారత ప్రధాని పివి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా మొయినాబాద్‌ లోని తొలకట్టలో పీవీ నరసింహారావు విగ్రహా ఆవిష్కరణ జరిగినది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ తొలకట్ట గేట్‌ సవిూపంలో ఉన్న మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు ఔషధ వనంలో జరిగినది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు వచ్చారు. పీవీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డి , రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తొలకట్ట సర్పంచ్‌ శ్రీనివాస్‌, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.