సమాజ సేవలో మెగా ఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు నియోజకవర్గం, ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి మరియు జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, తన పుట్టినరోజును పురస్కరించుకొని సెక్రెటరీ భరత్ సాగర్ తో కలిసి స్థానిక వేదా స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు 30 మందికి ఉదయం అల్పహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ మానవ విలువలు దిగజారుతున్న నేటి సమాజంలో సామాజిక సేవ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తనదైన రీతిలో ఎంతోకొంత సమాజానికి ఉపయోగపడాలనే మానవత్వం విలువల్ని కాపాడాలని కోరుతూ తనకు స్తోమత ఉన్నన్ని రోజులు తాను సామాజిక సేవ చేస్తానని రాహుల్ సాగర్ తెలిపారు.