Railwaykodur: భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ మార్కు సందర్భంగా వైద్య సిబ్బందిని సత్కరించిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబలించిన వేళ భారతదేశం 100 కోట్ల వాక్సిన్ మార్కును దాటిన రికార్డు అవుతుంది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచదేశాలను వణికించి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న చొవిద్ 19 నుండి రక్షణ దిశగా భారతదేశం వందకోట్ల కరోనా వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న సందర్భంగా, అందుకు సహకరించిన డాక్టర్స్, నర్స్ లు సంబంధిత సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్ గా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతూ రైల్వే కోడూర్ లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ చైతన్య, డాక్టర్ మార్టిన్ లూథర్ మరియు డాక్టర్ బ్రహ్మ కుమారిని గౌరవ ప్రదంగా శాలువ, పూలమాలతో ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, మహేష్ నగిరిపాటి, అంకిశెట్టి మని మరియు గిరిధర్ గారులచే చిరు సత్కారం చేయబడినది. అనతి కాలంలో ఉచితంగా వందకోట్ల వ్యాక్సిన్ లను వేయించడంలో చొరవ చూపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.