కాపు కళ్యాణమండపం రోడ్ ఎత్తు పెంచండి: జనసేన కౌన్సిలర్ శ్రీదేవి

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్ల, అమలాపురం పురపాలక సాధారణ సమావేశం ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన సమావేశం హలులో జరిగింది. ఈ సమావేశంలో 4వ వార్డ్ జనసేన కౌన్సిలర్ పడాల శ్రీదేవి మాట్లాడుతూ కాపు కళ్యాణమండపం రోడ్ చిన్నపాటి వర్షానికే మునిగిపోతుందని, రోడ్ ఎత్తు పెంచి, వేయాలని సమావేశంలో కోరారు. వర్షాకాలంలోపు సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ విఐపి నాయుడు హామీ ఇచ్చారు.