తాడిపత్రి జనసేన అధర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ

తాడిపత్రి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహా చారి, తాడిపత్రి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్ అధర్యంలో.. గౌరవ ముఖ్య అతిథిగా చిరంజీవి యువత సీనియర్ నాయకుడు మురళీ గారిచే రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల లోకి తీసుకొని వెళ్ళే విధంగా ఒక ప్రణాళికా బద్దంగా.. కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు అల్తఫ్, సాదక్, ఇమామ్, రబ్బానీ, నరేష్, మహేష్, షెక్షావలి, శివ, ప్రతాప్ పవన్కళ్యాణ్, సాయి, మాలిక్, శివకుమార్ రెడ్డి, షఫీ తదితరులు పాల్గొన్నారు.