వీరమహిళలను అభినందించిన శెట్టిబత్తుల రాజబాబు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో అమలాపురం నియోజకవర్గం నుండి వీరమహిళలు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ పట్ల, అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ పట్ల మీరు చూపించే ఆదరణ, అంకిత భావం అందరికీ స్ఫూర్తిదాయకం. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని అమలాపురం నియోజకవర్గం వీరమహిళల సత్తా చాటిన అందరికీ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అభినందనలు తెలిపారు.