క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన రాజమండ్రి జనసేన

రాజమండ్రి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాల ప్రధానం.. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా.. జనసేన క్రియాశీలక వాలంటీర్లకు చిరు సత్కారం అనంతరం.. కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, స్టేట్ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు రామచంద్రరావు, జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.